పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మీద లోక్ సభలో వాడీవేడిగా చర్చ నడుస్తోంది. ఇలా చర్చ జరుగుతున్న టైంలోనే.. ఆ ఉగ్రదాడి సూత్రధారుడు(Mastermind) హతమయ్యాడు. ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట సైన్యం కశ్మీర్లో చేపట్టిన ఏరివేతలో.. ముగ్గురు ముష్కరులు(Terrorists) హతమయ్యారు. లిద్వాస్ ప్రాంతంలో జరిగిన ఘటన మృతుల్లో లష్కరే తొయిబాకు చెందిన సులేమాన్ షా ఉన్నాడు. ఇతడిదే పహల్గామ్ ఉగ్రదాడిలో కీలకపాత్ర. ఆర్మీ, CRPF, జమ్ముకశ్మీర్ పోలీసులు అబూ హమ్జా, యాసిర్ అనే మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు.