ఉత్తర భారతం(North India)లో రెండ్రోజులుగా దాడుల చేస్తున్న పాక్.. 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని సైన్యాధికారులు ప్రకటించారు. LOC వెంబడి సామాన్యులపై కాల్పులు దిగుతోందని కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. 300 నుంచి 400 వరకు పాక్ డ్రోన్లను కూల్చివేసింది వాయుసేన. ఎయిర్ స్పేస్ మూసేశామని చెబుతూనే లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 దాడులకు పాల్పడినట్లు గుర్తించింది. పాక్ వాడినవి తుర్కియే(Turkey) ఆయుధాలని తేలింది. ఆలయాలు, గురుద్వారాలు, స్కూళ్లు లక్ష్యంగా దాడులు జరగ్గా.. పలు మిసైళ్లను మధ్యలోనే కూల్చేసింది. పూంఛ్ లోని స్కూల్ పై దాడిలో ఇద్దరు కవల విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, భారత్ ప్రతిదాడులతో శత్రువుకు ఊహించని నష్టం జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.