ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ దేశానికి రావాలంటూ దాయాది పాకిస్థాన్ ఆహ్వానం(Invites) పలికింది. అక్టోబరు 15, 16 తేదీల్లో నిర్వహించే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సుకు రావాలని కోరింది. కానీ ఈ విన్నపాన్ని ప్రధాని తిరస్కరించారు. ఇస్లామాబాద్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని నిర్ణయించిన మోదీ.. భారత్ తప్పక పాల్గొనాల్సి వస్తే ఇతర ప్రతినిధులను పంపించే యోచనలో ఉన్నారు.
2015లో జరిగిన ఉగ్ర(Terrorist) దాడి తర్వాత పాకిస్థాన్ తో ద్వైపాక్షికంగానూ, ఇతర సదస్సులకు భారత్ దూరం పాటిస్తున్నది. మొన్న జరిగిన జమ్మూ దాడి తర్వాత ప్రభుత్వ ప్రతినిధులెవరూ దాయాది దేశంలో పర్యటించకూడదన్న నిర్ణయానికి వచ్చారు. చరిత్ర నుంచి పాక్ ఏమీ నేర్చుకోవడం లేదంటూ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ మధ్యనే ప్రధాని అన్నారు. చివరిసారిగా 2015లో పాకిస్థాన్ లో పర్యటించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజే కావడం విశేషం.