
ఒకే దేశం-ఒకే ఎన్నికలపై గత 15 రోజులుగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ పార్లమెంటు(Parliament) సమావేశాలు(Sessions) ప్రత్యేకంగా అందుకోసమే నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ సెషన్స్ రేపట్నుంచి మొదలవుతున్నాయి. ఈ నెల 22 వరకు 5 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది క్వశ్చర్ మార్క్ గా తయారైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ మీటింగ్స్ పెడుతుండటంతో అందరిలోనూ యాంగ్జయిటీ కనిపిస్తున్నది. పార్లమెంటు 75 సంవత్సరాల ప్రస్థానంపై చర్చనే మెయిన్ అజెండాగా ఉంటుందని NDA చెబుతున్నా.. కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విపక్షాలు అనుమానిస్తున్నాయి.
75 ఏళ్ల ప్రస్థానంపై చర్చ ఉంటే గనుక వచ్చే శీతాకాల సమావేశాల వరకు ఆగవచ్చు కదా అని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును సైతం ప్రవేశపెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఎలాంటి నిర్ణయాలుంటాయో చూడాల్సి ఉంది. ఈ సమావేశాలు మొదటి రోజు నాడు పార్లమెంటు పాత భవనంలోనే జరగనుండగా… ఈ నెల 19 నుంచి కొత్త బిల్డింగ్ కు మారుస్తారు. ఆ రోజు కేవలం ఫొటో సెషన్ మాత్రమే నిర్వహించి 20వ తేదీ నుంచి మీటింగ్స్ మొదలు పెడతారు.