పార్లమెంటు సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కాబోతున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు(Sessions) డిసెంబరు 20 వరకు కొనసాగనుండగా.. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండు బిల్లులు ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. దేశానికంతటికీ ఒకే ఎన్నికను తెచ్చే ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’తోపాటు వక్ఫ్(Waqf) సవరణ బిల్లును ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉంది. వీటిని కాంగ్రెస్ నేతృత్వంతోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
25న సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా 24 నాడే అఖిలపక్ష(All Parties) భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ‘X’లో తెలియజేశారు. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.