హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఇక సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ టీమ్ చెప్పగానే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయన కన్నా ముందుగానే సుప్రీంలో పిటిషన్ వేసింది. ఒకవేళ KTR పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలంటూ ముందుగానే కేవియట్(Caveat) పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ-రేస్ కేసులో ACB నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరిన KTRకు హైకోర్టులో ఫలితం దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు ఉండటంతో అంతకన్నా ముందుగానే కేవియట్ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది.