
ఎలాంటి లోన్ తీసుకోకున్నా సిబిల్ స్కోర్ నెగెటివ్ గా ఉందంటూ ఉత్తరాఖండ్ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అసలు లోన్ తీసుకోకున్నా నెగెటివ్ స్కోరే కనపడటం వల్ల రుణాలు, క్రెడిట్ కార్డులు రావట్లేదంటూ రాజేంద్రసింగ్ పన్వర్ పిటిషన్ వేశాడు. దీంతో బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను జస్టిస్ పార్దివాలా, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ వివరణ కోరింది. ఒకే పేరు గల ఇతర వ్యక్తులకు అదే పాన్ నంబరు జారీ కావడంతో తప్పు జరిగినట్లు గుర్తించాయి. స్కోరును సరిచేశామని కోర్టుకు తెలిపాయి. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్ ను సిబిల్ స్కోరు అంటారు.