మణిపూర్ లో చోటుచేసుకున్న హింస, అల్లర్లు జాతికి సంబంధించిన హింస కాదంటూ మైతీ కమ్యూనిటీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. తమ రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలపై మైతీ కమ్యూనిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాదక ద్రవ్యాలు సాగు చేయడం వల్లే హింస తలెత్తిందని పిటిషన్ లో తెలియజేసింది. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. అసలు నిజాలతో పిటిషన్ దాఖలు చేయాలని ఆ కమ్యూనిటీకి సంబంధించిన లాయర్ కు స్పష్టం చేసింది.