లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) రేట్లను తగ్గించింది. ఈ రెండింటిపై రూ.2 మేర తగ్గిస్తూ(Reduced) నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు రేపు పొద్దున 6 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోలు ధర రూ.96.72 కాగా.. డీజిల్ ధర రూ.87.62గా ఉంది.
అయితే ధరల తగ్గింపు ఆశాజనకంగానే ఉంటుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జోరందుకుంది. లోక్ సభ ఎన్నికల(Loksabha Elections)కు నోటిఫికేషన్ రాబోతున్న దశలో జరిగిన కేబినెట్ సమావేశాల్లోనూ దీనిపై నిర్ణయం వెలువడుతుందని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరల్ని రూ.2 మేర తగ్గిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటన చేశారు.
తగ్గించిన ధరలతో…
ఈ తగ్గింపు ధరలతో దేశవ్యాప్తంగా డీజిల్ ఆధారంగా నడిచే 58 లక్షల భారీ వాహనాలు(Heavy Goods Vehicles), పెట్రోలు ఆధారంగా సాగే 6 కోట్ల కార్లు, 27 కోట్ల మోటార్ సైకిళ్లకు భారం తగ్గనుందని కేంద్రం తెలియజేసింది.