ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court)కు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే కేసు ఇన్వెస్టిగేషన్ ఎక్కువ కాలం కొనసాగడం సరికాదని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కీలక నిందితుడుగా ఉన్న అడిషనల్ SP తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మరో నాలుగు నెలల పాటు జరిగే అవకాశముందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేయగా.. సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని బెంచ్ అభిప్రాయపడింది. పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేని చెబుతూనే.. దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తప్పనిసరి అయితేనే జైలులో ఉంచాలని, బెయిల్ పొందడం హక్కు అన్న సుప్రీం తీర్పుల్ని తిరుపతన్న న్యాయవాది గుర్తు చేశారు. అదనపు SP కేసులో దర్యాప్తు పరిణామాలేంటి.. ఎంత టైమ్ పడుతుందో రాతపూర్వకంగా చెప్పాలంటూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, తిరుపతన్న తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.