అంతరిక్ష కేంద్రం(ISS)లో 9 నెలలు గడిపి భూమిపైకి తిరిగివస్తున్న వ్యోమగామి సునీత విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ‘మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం.. వేల మైళ్ల దూరంలో ఉన్నా అందరి హృదయాలను హత్తుకున్నారు.. సునీత విలియమ్స్ ను చూసి 140 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోతున్నారు.. అమెరికా పర్యటనల్లో బైడెన్, ట్రంప్ ను కలిసినప్పుడు మీ యోగక్షేమాలు తెలుసుకున్నా.. ఇటీవలి పరిణామాలు మీ స్ఫూర్తిదాయక(Fortitude) ధైర్యాన్ని, పట్టుదలను మరోసారి గుర్తుచేశాయి..’ అని మోదీ ప్రస్తావించారు. భారత్ లో పర్యటించాలని కోరారు.