
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు సజీవదహనంలో 19 మంది మృతిచెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున అందజేస్తారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం జరిగింది.