BJP-సంఘ్(RSS) అభిప్రాయాలు వేర్వేరు కాదని ప్రధాని మోదీ అన్నారు. సంఘ్ కు నేటితో శత వసంతాలు పూర్తయిన సందర్భంగా నాగపూర్లోని RSS ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మోదీ ఏమన్నారంటే…
‘RSS-BJP సంబంధాల గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంటుంది.. ఆ రెండింటి అభిప్రాయాలు వేర్వేరు కాదు.. సంఘ్-బీజేపీ గురించి ఏమీ తెలియని వ్యక్తులు వాటి మధ్య అభిప్రాయ భేదాలున్నాయంటారు.. తప్పుడు విషయాలను ప్రచారం వారున్నారు.. రాజకీయ ప్రయోజనం కోసమే ఇలా చేస్తుంటారు..’ అని మోదీ స్పష్టం చేశారు. ప్రధానిగా RSS కార్యాలయాన్ని సందర్శించడం ఆయనకు ఇదే మొదటిసారి.