రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS).. తనను ఆకర్షించిన తీరుపై మోదీ మనసు విప్పి మాట్లాడారు. లెక్స్ ఫ్రిడ్మాన్ అనే రీసెర్చర్ కు పాడ్ కాస్ట్(ఇంటర్వ్యూ) ఇచ్చారు. RSSతో అనుబంధం, హిందూ జాతీయవాదం గురించి మోదీ మాటల్లోనే… https://justpostnews.com
‘మా ఊరిలో RSS శాఖ ఉండేది.. క్రీడలు, దేశభక్తి పాటలు వేసేవారు.. ఆ పాటలు నా గుండె లోతుల్ని తాకాయి.. అప్పుడే అంతర్మథనం మొదలై సంఘ్ లో చేరా.. మీరు ఏం చేసినా, దానికో అర్థం ఉండాలి అనే మాట వినేవాణ్ని.. చదువుకునే టైంలో ఆ చదువు కూడా దేశానికి ఉపయోగపడాలని.. ఎక్సర్ సైజ్ చేస్తుంటే, దేహదారుఢ్యం జాతికి అవసరమన్నది మనసులో నాటుకుపోయింది.. అతిపెద్ద సంస్థ RSS ఇప్పుడు వంద వసంతాల్లోకి అడుగుపెడుతోంది.. ఇలాంటి సంస్థ ప్రపంచంలోనే లేదు.. కోట్లాది మంది అంకితమైన సంఘ్ ఏమాత్రం సామాన్యమైంది కాదు..’ అంటూ ఆనాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.