భారత వస్తువులపై అమెరికా 25% సుంకాలు విధిస్తే అందుకు ప్రధాని మోదీ ప్రత్యేక పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పౌరుడు(Citizen) స్వదేశీ ఉత్పత్తుల్నే వాడాలని కోరారు. సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ఆయన.. దేశ ప్రయోజనాల కోసమే ఆర్థిక వ్యవస్థ ఉంటుందన్నారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది.. సొంత ప్రయోజనాలపై ప్రతి దేశం దృష్టిపెట్టాల్సి వచ్చింది.. ప్రతి ఒక్కరికీ దేశానికి సంబంధించిన కొన్ని బాధ్యతలున్నాయి.. ప్రతిసారీ మోదీ చెప్పడమే కాదు.. వ్యక్తులైనా, పార్టీలైనా స్వదేశీ ఉత్పత్తుల్నే వాడాలి.. అలా చేస్తే మన ఆర్థిక వ్యవస్థకు తిరుగుండదు, ఇంకొకరిపై ఆధారపడే అవసరం రాదు..’ అని స్పష్టం చేశారు.