భారత రెజ్లర్(Wrestler) వినేశ్ ఫొగాట్ పై వేటు పడటం భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. 100 గ్రాముల బరువు ఎక్కువున్నారంటూ ఆమెను డిస్ క్వాలిఫై చేయడంపై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ రెస్పాండ్ అవుతూ నువ్వు ఛాంపియన్ కే ఛాంపియన్ అంటూ ఆమెపై పొగడ్తలు కురిపించారు.
జరిగిన తతంగంపై ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్(IOA) అధ్యక్షురాలు పి.టి.ఉషకు మోదీ ఫోన్ చేశారు. వినేశ్ పై తీసుకున్న నిర్ణయం మీద తీవ్ర నిరసన తెలపాలని స్పష్టం చేశారు. ఆమె పోటీ చేసేందుకు గల అవకాశాలున్నాయేమో పరిశీలించాలని ఉషకు మోదీ సూచించారు.
కేవలం 100 గ్రాముల బరువు కారణంగా వేటు పడుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇండియన్ ఒలింపిక్ కమిటీ(IOA) అధ్యక్షుడిగా పనిచేసిన బ్రిజ్ భూషణ్ ను తొలగించాలంటూ పలువురు ప్లేయర్లతో ఫొగాట్ తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఇప్పుడిలా జరగడం వెనుక ఆనాటి కోణమేదైనా ఉందా అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.