అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడెలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. కానీ ప్రధాని మోదీకి ఆయన ఇచ్చిన గౌరవం మాత్రం ఊహించనిది. తమ ఇద్దరి ఫ్రెండ్ షిప్ గురించి మోదీ ఏమన్నారంటే…
‘2019లో హ్యూస్టన్లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమం.. ట్రంప్, నేను ఉన్నాం.. స్టేడియం మొత్తం నిండిపోయింది.. స్పోర్ట్స్ లో స్టేడియాలు నిండటం కామన్ కానీ రాజకీయ వేదికను అలా చూడటం ఆశ్చర్యం.. నేను స్పీచ్ ఇస్తుంటే జనాల్లో కూర్చుని ట్రంప్ విన్నారు.. అది పూర్తయ్యాక సెక్యూరిటీ మొత్తాన్ని పక్కనబెట్టి ఒక సామాన్యుడిలా నాతోపాటు స్టేడియం మొత్తం తిరిగారు.. అగ్రరాజ్య అధినేత అలా నాకిచ్చిన గౌరవం, ఆ ఒక్క సంఘటన నన్ను తాకింది..’ అంటూ US ప్రెసిడెంట్ ఆత్మీయతను గుర్తు చేసుకున్నారు.