సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేవలం రెండు రోజుల ముందు జరిగిన కౌంటింగ్ లో ఒక రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ(BJP) నిలబెట్టుకుంది. భారీ మెజార్టీతో తిరుగులేని రీతిలో మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నది. అటు సిక్కింలోనూ వరుసగా రెండోసారి సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) గెలుపొంది.. కంటిన్యూగా అధికారాన్ని చేపట్టనుంది. 32 స్థానాలకు గాను SKM 30 సీట్లను కైవసం చేసుకుంది.
ఏప్రిల్ 19న తొలి విడతగా జరిగిన ఎన్నికలకు గాను అరుణాచల్‌లో 60 సీట్లకు గాను పదింటిని పోటీ లేకుండానే ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 50 స్థానాలకు ఈరోజు కౌటింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు కమలం పార్టీ 39 సీట్లు గెలుచుకోగా మరో ఏడు స్థానాల్లో ఆధిక్యం(Lead)లో ఉంది. CM పెమా ఖండూ, డిప్యూటీ CM చోనా మీన్ ఇద్దరూ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో BJPకి 41 సీట్లు వచ్చాయి.