ప్రముఖ సినీనటుడు, శాసనసభ్యుడైన నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. సినీ కళారంగానికి అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటిస్తే అందులో ఏడుగురికి దేశ రెండో అత్యున్నత అవార్డయిన పద్మవిభూషణ్(Padma Vibhushan), 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనుంది. ఈ 139 మందిలో సినీనటుడు, 100 ఏళ్ల వయసు గల స్వాతంత్ర్య సమరయోధుడు(Freedom Fighter), పారాలింపియన్ ఉన్నారు. తెలంగాణ నుంచి డా.దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్, మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు.