దేశంలో విద్య(Education) ఖరీదైన సాధనమైంది. గతంలో పెద్ద చదువులకు లక్షలు వెచ్చిస్తే.. ఇప్పుడు నర్సరీకే ధారపోస్తున్నారు. కుటుంబాల ఆర్జనలో 20% ఫీజులకే పోతోంది. ఆదాయం ఏటా 0.4% పెరిగితే, రుసుములు 30-40% పెంచుతున్నారు. ఈ ఏడాది నెలకు రూ.20 వేలు సంపాందించే వ్యక్తి రూ.4 వేలు పక్కనపెడితే.. వచ్చే ఏడు జీతం పెరిగేదెంత, ఫీజులు కట్టేదెంత అన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఫీజుల కోసమే EMIలు తీసుకుంటున్నారు. ఈ విషయాల్ని క్రిప్టోకరెన్సీ యాప్ కాయిన్ కో-ఫౌండర్ ఆశిష్ సింఘాల్ గుర్తు చేశారు. ‘30% పెంపు దొంగతనం కాక మరేమిటి.. ‘నా కూతురు ఫీజు చూసి షాకయ్యా.. బెంగళూరులో మూడో క్లాసుకు రూ.2.1 లక్షలు.. ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కాదు, రెగ్యులర్ CBSEనే.. ఒక వ్యక్తి రూ.2 లక్షలు చెల్లించాడు.. ఇది ఇంజినీరింగ్ ఫీజుతో సమానం.. దేశంలో ఇంచుమించు అన్ని స్కూళ్లు ఏటా 10 నుంచి 30% పెంచుతున్నాయి..’ అంటూ పోస్ట్ చేశారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com