కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో(By Elections) కాంగ్రెస్ పార్టీ తిరుగులేని రీతిలో ఆధిక్యం సంపాదించింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ప్రియాంకకు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెడుతున్నారు. ఆమె ప్రత్యర్థిపై 3.82 లక్షల ఓట్ల లీడ్ లో ఉండగా, మిగతా రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటివరకు ఆమెకు ఐదు లక్షలకు పైగా ఓట్లు రాగా, CPIకి చెందిన సత్యన్ మోకెరీకి లక్షన్నరకు పైగా, BJP అభ్యర్థి నవ్య హరిదాస్ కు 85 వేల ఓట్లు పోలయ్యాయి.
గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇప్పుడా రికార్డును కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా తిరగరాయగా, మరింత భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉంది. వయనాడ్ లో మొత్తం 9.52 లక్షల ఓట్లు పోలైతే అందులో ఇప్పటికే ఆమె 5 లక్షలు దాటగా, మొత్తంగా 6 లక్షల ఓట్లు దక్కించుకుంటారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.