కోట్లల్లో ఆస్తులున్నా పేదరాలినని చెప్పడం.. వైకల్యం(Disability) పేరిట పోస్టింగ్ పొందినట్లు ఆరోపణలు… ట్రెయినీ అయినా కారు, క్వార్టర్స్ కేటాయించాలని డిమాండ్ చేయడం వంటి కారణాలతో వివాదంగా మారిన IASపై కేంద్రం చర్యలు తీసుకుంది. పూజ ఖేడ్కర్ ను ముస్సోరిలోని అకాడమీకి వెనక్కి పిలిపిస్తూ(Recalled) ఆదేశాలు వచ్చాయి.
అసలు వ్యవహారమిది…
సివిల్స్ 841 ర్యాంకర్ అయిన పూజ ఖేడ్కర్ మహారాష్ట్ర కేడర్ కు గాను పుణెలో ట్రెయినీగా పనిచేస్తూ గందరగోళంగా వ్యవహరించారు. గొంతెమ్మ కోర్కెలు కోరడంతో అక్కడి కలెక్టర్ ప్రభుత్వానికి కంప్లయింట్ చేశారు. తన ఆడి కారుకు ఎరుపు, నీలి రంగుల బీకన్(Beacon) లైట్లు పెట్టుకోవడం, జాయింట్ కలెక్టర్ లేని సమయంలో తన నేమ్ ప్లేట్ తో ఛాంబర్ ఆక్రమించుకోవడంతో ఆమెను పుణె నుంచి వాశిమ్ జిల్లాకు పంపించారు.
తల్లి కూడా…
ఈమె ఇలా ఉంటే ఇక రైతుల భూముల్ని లాక్కుని ఫెన్సింగ్ వేస్తున్న సమయంలో అడ్డుకున్న యజమానుల్ని తుపాకీతో పూజ తల్లి మనోరమ బెదిరించిన వీడియోలు హల్చల్ చేశాయి. ఇన్ని వివాదాలు నడుమ.. పూజ రిక్రూట్మెంట్ పై కేంద్రం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను వెనక్కు పిలిపిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.