వివాదాస్పద IAS పూజ ఖేడ్కర్ ఘటన దుమారం రేపుతున్న ప్రస్తుత తరుణంలో మరో ఐఏఎస్ బాగోతం వెలుగులోకి వచ్చింది. వైకల్యం(Disability) లేకున్నా ఆ కోటాలో పోస్టింగ్ పొందడం.. రూ.25 కోట్ల ఆస్తులున్నా తాను పేద వ్యక్తిగా చెప్పుకుంటూ సివిల్స్ కు ఎంపికయ్యారని పూజపై ఆరోపణలున్నాయి. ఇప్పుడిలాంటి కేసే మరొకటి బయటపడింది.
2011 బ్యాచ్…
అభిషేక్ సింగ్ అనే 2011 బ్యాచ్ IASను వైకల్యం కింద సెలెక్ట్ చేసిన విషయం కలకలం రేపింది. నటుడి(Actor)గా మారడానికి అతడు గతేడాది IASను వదిలేశాడు. అయితే వైకల్యమున్న వ్యక్తి డ్యాన్స్, జిమ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. బ్యూరోక్రాట్ సెలక్షన్స్ లో మరింత పారదర్శకత ఉండాలంటూ పూజ ఖేడ్కర్ విషయంలో అభిషేక్ చేసిన కామెంట్స్ తిరిగి ఆయన్నే చుట్టుముట్టాయి.
ఏమైందంటే…
డిజెబిలిటీ కోటా కింద UPSC సెలక్షన్స్ లో అభిషేక్ లబ్ధి పొందాడన్నది ఆరోపణ. దీనిపై అతడు స్పందిస్తూ.. రిజర్వేషన్లను సమర్థించినందుకే తనపై ఇలా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘నా కులాన్ని, నా ఉద్యోగాన్ని ప్రశ్నిస్తున్నారు.. నేను కష్టంతో, ధైర్యంతో ప్రతీది సాధించా.. రిజర్వేషన్ ద్వారా కాదు..’ అంటూ ‘X’లో ట్వీట్ చేశారు.