పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. UPA హయాంలో నిర్వహించిన సర్వేను ఇప్పటికీ ఎందుకు రిలీజ్ చేయడం లేదని విమర్శించారు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో నిర్వహించిన ‘ఆవాస్ న్యాయ సమ్మేళన్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. రిమోట్ కంట్రోల్ ను కాంగ్రెస్ పార్టీ నొక్కితే సంక్షేమ పథకాలు పేదలకు చేరుతాయని.. అదే BJP మీట నొక్కితే కార్పొరేట్లకు నిధులు ట్రాన్స్ ఫర్ అవుతాయన్నారు.
మోదీ ప్రభుత్వాన్ని కేబినెట్ సెక్రటరీలు, ఇతర కార్యదర్శులే తప్ప MPలు, MLAలు నడపడం లేదని, నడపబోరని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 90 మంది సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే OBCలు ఉన్నారన్న రాహుల్.. దేశంలో ఐదు శాతమే OBCలు ఉన్నారా అని ప్రశ్నించారు.