రతన్ టాటా… టాటా సన్స్ ఛైర్మన్ గానే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆదర్శనీయుడు. టాటా కంపెనీని ప్రపంచ పటంలో టాప్ ప్లేస్ లో నిలిపిన ఆయన విధానాలు.. దేశంలోని పారిశ్రామికవేత్తలతోపాటు యువతకు గొప్ప ప్రేరణ(Inspiration)గా నిలిచాయి. అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. దేశభక్తితో కూడిన సరళతర కార్పొరేట్ విధానాలతో దేశానికి వన్నె తెచ్చిన రతన్ టాటా.. భారతదేశం జరిపిన యుద్ధంతోనే ఆయన వ్యక్తిగత జీవితమూ ముడిపడిపోయిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం వయసు మీద పడ్డ ఆయన.. తన మనసులోని మాటను పంచుకున్న తీరు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. యవ్వనంలో తానూ ప్రేమలో పడ్డానని ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో 1962లో భారత్-చైనా యుద్ధం తన బంధాన్ని విడదీసిందని చెప్పారు.
దేశంతో యుద్ధం… మనసులో అంతర్యుద్ధం…
లాస్ ఏంజిల్స్ లో ఒక మహిళతో ప్రేమలో పడ్డానని, ఆమెతో దాదాపు పెళ్లి చేసుకునే స్థితికి వెళ్లానని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన ‘భార్య’ అని పిలవగలిగే వ్యక్తిని తాను కలవలేకపోయాయని గుర్తు చేసుకున్నారు. ‘నాకు దాదాపు లాస్ ఏంజిల్స్ లో వివాహం జరిగింది.. కానీ నేను మా అమ్మమ్మతో కలిసి వెంటనే భారతదేశానికి రావడంతో అది కుదరలేదు.. నేను మూడు ముళ్లు వేయాలని ఆశించిన వ్యక్తి అతి త్వరలోనే నాతో చేరవలసి ఉంది.. కానీ భారత్-చైనా యుద్ధం మొదలయ్యాక వాళ్ల తల్లిదండ్రులు ఆమెను భారత్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బంధం విడిపోయిందని గత అనుభవాన్ని పంచుకున్నారు. ‘ఆ తర్వాత సంబంధాలు ఎన్నో వచ్చాయి.. కానీ నేను భార్య అని పిలవగలిగే వ్యక్తి నాకెప్పుడూ కనపడలేదు.. అప్పటికి నా జీవితమే ఒక సంఘర్షణగా మారింది.. అప్పట్నుంచి నేను నిరంతరం పనిచేస్తూ ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాను.. నాకంటూ తక్కువ సమయం ఉంది.. కానీ ఈ రోజు వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు నేను దేనికీ చింతించను అని మిస్టర్ టాటా’ తన విరహ వేదనను వెల్లడించారు.
టాటా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం గురించి.. అమ్మమ్మతో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఇటు తల్లిదండ్రులు అటు ఆ అమ్మాయితో దూరమైన తర్వాత తాను, తన బ్రదర్… ‘ సరసమైన ర్యాగింగ్’ ను రిలేటివ్స్ తో ఎదుర్కొన్నామని, అయినా తన సోదరుడు బాల్యాన్ని సంతోషంగా గడిపారని టాటా తెలియజేశారు. తల్లిదండ్రుల నుంచి ఆ పరిస్థితి ఎదురయ్యాక అమ్మమ్మతోనే కలిసి US వెళ్లిన రతన్.. హయ్యర్ స్టడీస్ కోసం కార్నెల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. తన జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలను ఎప్పుడూ బయటపెట్టని రతన్ టాటా.. సమాజం కోసమే జీవితాన్ని అంకితం చేసి ‘గ్రేట్ పర్సన్’ గా ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయారు.
Good news paper
Great man ..
Hat’s of to the Dedication