జన్ ధన్ యోజన ఖాతాల రీ-KYCకి RBI గడువిచ్చింది. దేశంలో ప్రతి ఫ్యామిలీకి ఒక్క బ్యాంక్ అకౌంటైనా ఉండాలన్నదే ఈ స్కీం లక్ష్యం. ఇప్పటికే పదేళ్లు కాగా, సెప్టెంబరు 30 లోపు రీ-KYC పూర్తి చేసుకోవాలి. ఆయా బ్యాంకుల క్యాంపులు పంచాయతీ స్థాయిల్లోనే ఉన్నందున అక్కడ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. రీ-కేవైసీ, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీంలకు వివరాలివ్వొచ్చు. ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. SBIలో భారీగా ఖాతాలుండగా, నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవ్వాలి. మై అకౌంట్స్ & ప్రొఫైల్స్ ట్యాబ్ పై క్లిక్ చేసి అప్డేట్ KYCని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ప్రొఫైల్ పాస్ వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి. తర్వాత మీ మెనూలోని వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.