చంద్రయాన్-2కు ఫాలోఆన్ మిషన్ గా భావిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది… భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO. చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ కావడం, జాబిల్లి ఉపరితలంపై పరిభ్రమించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేయాలనుకుంటోంది. వచ్చే నెల(జులై) 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. లాంఛ్ వెహికిల్ మార్క్-3 ద్వారా మధ్యాహ్నం 2:30 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. ఇప్పటికే చంద్రయాన్ వ్యోమనౌక శ్రీహరికోటకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
చంద్రయాన్-2 పరిణామంతో జాగ్రత్తలు
2019 జులై 22న చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించగా, ఆగస్టు 20న మిషన్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంది. ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉన్న పరిస్థితుల్లో ఉపరితలానికి సమీపంలో పక్కకు పడిపోయింది. సాఫ్ట్ వేర్ లో ప్రాబ్లమ్స్ ఏర్పడి ఇస్రోతో ల్యాండర్ కు కమ్యూనికేషన్స్ కట్ అయ్యాయి. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే సమయంలో ఈ యాత్రకు శ్రీకారం చుడుతుండటం విశేషంగా నిలుస్తోంది. తక్కువ ఇంధనం ఖర్చుతోనే జాబిల్లి యాత్ర చేపట్టడానికి అనువైన సౌకర్యాలు ఈ సమయంలో ఉంటున్నందునే జులైని ఎంచుకున్నారు. గత అనుభవం మిగిల్చిన పాఠాలతో ఇప్పుడు చంద్రయాన్-3ని నింగిలోకి పంపేందుకు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Good information