అహ్మదాబాద్ లో జూన్ 12న ఎయిరిండియా(Air India) విమానం కూలడానికి కారణం రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడమేనని తేలింది. స్విచ్ ఆఫ్ అయి ఇంజిన్లకు ఇంధనం(Fuel) నిలిచిపోయింది. దీనిపై కాక్ పిట్లోని ఇద్దరు పైలట్ల మాటలు బ్లాక్ బాక్స్ లో రికార్డయ్యాయి. ఫ్యూయల్ ఎందుకాపేశావ్.. అని ఒక పైలట్ అడిగితే నాకేం తెలియదంటూ మరో పైలట్ బదులిచ్చాడు. ఇంజిన్లను రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంజిన్-1 కోలుకుంటున్న టైంలోనే ఇంజిన్-2 ఫెయిలైంది. సెకను వ్యవధిలోనే ఇలా జరగ్గా.. అత్యవసర హైడ్రాలిక్ శక్తినిచ్చే రామ్ ఎయిర్ టర్బైన్(RAT) ఆన్ చేశారు. అయినా ఫలితం లేక 32 సెకన్లలో విమానం బూడిదగా మారింది. https://justpostnews.com