
మూడు శాసనసభల ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకే పుదుచ్చేరిలో 86.92%, అస్సాంలో 84.42%, కేరళంలో 75.01% ఓటింగ్ నమోదైంది. ఇంకా క్యూలో చాలా మంది ఉండటంతో అది 90% దాటే అవకాశముంది. 2021లో అస్సాంలో 82.04%, కేరళంలో 74.06% నమోదైతే ఈసారి దాన్ని దాటింది. కేరళంలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి.
మలయాళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నడవగా, బీజేపీ సైతం బాగానే వేగం పుంజుకుంది. తిరువనంతపురంలో ఏకంగా మేయర్ పదవినే గెలుచుకోవడంతో కమలం పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. అస్సాంలో హిమంత బిశ్వశర్మ మూడోసారి అధికారం కోసం వేచిచూస్తుండగా, పుదుచ్చేరిలో మళ్లీ పాగా వేయాలని అధికార ఎన్డీయే చూస్తోంది.