
భారత్ లో ప్రపంచంలోనే అత్యంత అసమానతలున్నాయని, గత దశాబ్దకాలంలో ఎలాంటి పురోగతి లేదని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్-2026 తెలిపింది. మొత్తం జాతీయాదాయంలో 58% సంపద 10% మంది చేతిలో ఉందని, 2021లో ఇది 57% కాగా, ఇప్పుడు పెరిగింది.ని గుర్తు చేసింది. 50% మంది(70 కోట్లు) కేవలం 15% మాత్రమే పొందుతున్నారు. అసమానతలు తీవ్రం కాగా, మహిళా శ్రామిక ఆదాయం వాటా 18% మాత్రమే. గ్రామీణ అట్టడుగు 50% సగటు ఆదాయం ఏడాది రూ.32 వేలు, పట్టణ టాప్ 1% ఆదాయం రూ.53 లక్షలని రిపోర్టులో తెలిపింది. నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు ఉండాలని చెప్పింది. ప్రైవేటీకరణ, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో సంపద కొన్ని చేతుల్లో కేంద్రీకృతమవుతోందని హెచ్చరించింది. బలహీన కార్మిక చట్టాలు, తక్కువ యూనియన్లతో 60% మంది జీతాలపై పట్టింపులేదని తేలింది. సగటు తలసరి ఆదాయం పెరగడం నిజమేనని 2014లో 1,900 డాలర్లుంటే 2025లో 6,200 డాలర్లకు పెరిగిందని కానీ ఫలాలు కొందరి చేతుల్లోకే వెళ్తున్నాయని రిపోర్ట్ తెలిపింది.