ఉత్తర కాశీలోని సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదంలో సహాయక చర్యలు(Rescue Operation) కీలక దశకు చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో సొరంగంలో చిక్కుకున్న బాధితుల్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛార్ ధామ్ దారిలో టన్నెల్ నిర్మిస్తున్న సమయంలో మట్టి పెళ్లలు విరిగిపడి అది మూసుకుపోవడంతో అందులో పనిచేస్తున్నవారంతా చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్నవారితో మాట్లాడిన సహాయక సిబ్బంది.. వారికి ఆహారం, తాగునీటిని పంపించగలిగారు. ఇప్పుడు డ్రిల్లింగ్ చేసి స్టీల్ పైపులను లోపలకు పంపుతున్నారు. రెండు రోజుల్లో బాధితులంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతున్నది.
సహాయక చర్యల్లో 150 మంది దాకా సేవలందిస్తున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శనలను ఛార్ ధామ్ ధామ్ యాత్రగా పిలుచుకునే ఈ తీర్థయాత్రకు వెళ్లేందుకు గాను ఉత్తర కాశీలో భారీ టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇప్పుడీ టన్నెల్ లోనే ప్రమాదం జరిగి పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు.