దేశంలోనే అత్యంత ధనిక(Richest) ఎమ్మెల్యేగా BJPకి చెందిన పరాగ్ షా నిలిచారు. ముంబయి తూర్పు ఘట్కోపర్ నుంచి గెలిచిన ఆయన.. ఆస్తులు రూ.3,400 కోట్లు. రెండో స్థానంలో కర్ణాటక డిప్యూటీ CM డి.కె.శివకుమార్ ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR) ప్రకటించింది. కనకపుర MLA శివకుమార్ ఆస్తులు రూ.1,413 కోట్లు. వారి తాజా ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది MLAల వివరాల్ని ADR సేకరించింది. ఇక కమలం పార్టీకే చెందిన పశ్చిమబెంగాల్లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధార అత్యంత పేద సభ్యుడిగా నిలిచారు. ఆయన ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమేనట.
AP నుంచి భారీగా…
టాప్-10 లిస్టులో AP నుంచి నలుగురు స్థానం సంపాదించారు. CM చంద్రబాబు(TDP)కి రూ.931 కోట్లు, మంత్రి నారాయణ(TDP)కి రూ.824 కోట్లు, వై.ఎస్.జగన్(YSRCP)కి రూ.757 కోట్లు, వి.ప్రశాంతిరెడ్డి(TDP)కి రూ.716 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతో కలిపితే టాప్-20లో ఆరుగురు ఉన్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే 223 మంది కర్ణాటక MLAల ఆస్తులు రూ.14,179 కోట్లు కాగా.. ఆ స్టేట్ దే టాప్ ప్లేస్. 286 సభ్యుల మహారాష్ట్ర రూ.12,424 కోట్లతో, 174 మంది ఆంధ్రప్రదేశ్ MLAల ఆస్తులు రూ.11,323 కోట్లతో 2, 3 స్థానాల్లో నిలిచాయి.
యావరేజ్ టాప్ లోనూ ఏపీయే…
మొత్తం ఆస్తుల్లో ఒక్కో MLAకు యావరేజ్ లెక్కగడితే రూ.65.07 కోట్లతో AP టాప్ లో ఉంది. రూ.63.58 కోట్లతో కర్ణాటక, రూ.43.44 కోట్లతో మహారాష్ట్ర తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. త్రిపురకు చెందిన 90 మంది ఆస్తులు రూ.90 కోట్లు కాగా.. వారిదే చివరి స్థానం. 4,092 సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.73,348 కోట్లు. ఇది నాగాలాండ్(రూ.23,086 కోట్లు), త్రిపుర(రూ.26,892 కోట్లు), మేఘాలయా(రూ.22,022 కోట్లు) రాష్ట్రాల బడ్జెట్ల కన్నా ఎక్కువన్నమాట.
1 thought on “ధనిక ఎమ్మెల్యేల్లో తెలుగు రాష్ట్రం టాప్… Richest MLAs List”