తమిళనాడు బడ్జెట్ ప్రతుల్లో రూపాయి(₹) సింబల్ ను మార్చడం దుమారం రేపింది. జాతీయ విద్యా విధానం(NEP) అమలుపై కేంద్రం, స్టాలిన్ సర్కారు మధ్య అగ్గి రాజుకుంది. రూపాయి సింబల్ తొలగించి తమిళ ‘రూ’ అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. అయితే ఈ గుర్తును తయారు చేసిందీ తమిళుడే. IIT ప్రొఫెసర్ డి.ఉదయ్ కుమార్ దీని రూపకర్త. స్టాలిన్ పార్టీ(DMK)కే చెందిన మాజీ MLA ధర్మలింగం కుమారుడే ఉదయ్. 2010 జులై 15న ప్రధాని మన్మోహన్ సింగ్.. కరెన్నీ నోట్లపై దీన్ని వాడుకలోకి తెచ్చారు.
అప్పుడేం జరిగిందంటే…
రూపాయి డిజైన్ కోసం అప్పటి UPA సర్కారు పోటీ నిర్వహించింది. IIT ముంబైలో PG పూర్తి చేసిన ఉదయ్ సైతం ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నారు. దేవనాగరిలోని ‘ర’ను, రోమన్ లోని ‘ఆర్’ కలిపి రూపాయి(₹) తయారు చేశారు. కళ్లకురిచిలో జన్మించిన ఆయన IIT గౌహతిలో జాబ్ లో చేరే ఒకరోజు ముందు.. విజేతల్ని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందల డిజైన్లు పరిశీలిస్తే అందులో ఉదయ్ కుమార్ సింబల్ ఎంపిక కాగా, 2.5 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.