
సంస్థానాల్ని విలీనం చేసి దేశ ఐక్యతను చాటిన భారత ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఆయన సేవల్ని స్మరించుకుని నివాళులర్పించారు. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని కీర్తించారు. ఢిల్లీలో రన్ ఫర్ యూనిటీని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధాని మోదీ గుజరాత్ లోని యూనిటీ ఆఫ్ స్టాచ్యూ వద్ద నివాళులర్పించారు. హైదరాబాద్ పటేల్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు. బషీర్ బాగ్ లో BJP ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ బషీర్ బాగ్ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి అసెంబ్లీ వద్ద గల పటేల్ విగ్రహం వరకు కొనసాగింది.