బడిలోని ఒక్క గోడకు 4 లీటర్ల పెయింట్ వేయాలి.. ఒక్కరో, ఇద్దరో అవసరం.. కానీ 168 మంది కూలీలు, 65 మంది మేస్త్రీలు పనిచేశారు.. మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన నిర్వాకమిది. షాహదోల్(Shahdol) జిల్లా సకండి గ్రామ పాఠశాలలో రూ.1.07 లక్షలు ఖర్చయినట్లు లెక్కలు చూపారు. ఇక నిపానియా(Nipaniya) గ్రామ బడి.. ఇంకో అడుగు ముందుకేసింది. 20 లీటర్ల పెయింట్ కోసం 275 మంది కూలీలు, 150 మంది మేస్త్రీలకు వెచ్చించిన నిధులు రూ.2.31 లక్షలు. ఈ స్కూల్ పనికి 2025 మే 5న బిల్లు పెట్టుకోగా, ఏప్రిల్ 4న ప్రధానోపాధ్యాయుడు పరిశీలించినట్లు చూపించారు. ఈ రెండు పాఠశాలల కథ సోషల్ మీడియాలో వైరలైంది. ఇంకేముంది.. DEO ఫూల్ సింగ్ మర్పాచి రంగంలోకి దిగి.. సదరు బడులపై దర్యాప్తు జరుపుతున్నారు. https://justpostnews.com