పార్లమెంటు(Parliament) వద్ద మరోసారి భద్రతా లోపం కనపడింది. చెట్టు నుంచి గోడపైకి చేరుకుని లోపలికి ప్రవేశించాడో వ్యక్తి. ఉదయం 6:30 గంటలకు రైల్ భవన్ వైపు నుంచి కొత్త పార్లమెంటు భవనంలోని గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. వర్షాకాల సమావేశాల్లో తరచూ ఆటంకాలేర్పడుతూ వాయిదా పడ్డ మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది అతణ్ని పట్టుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఇలాగే ఓ వ్యక్తి అక్కడి గోడ దూకాడు. 2001 పార్లమెంటు దాడి మృతులకు 2023లో నివాళులర్పిస్తుండగా కొందరు వ్యక్తులు లోక్ సభ ఛాంబర్లోకి ప్రవేశించి అలజడి సృష్టించారు.