సూర్యుడి వద్దకు బయల్దేరిన ఆదిత్య ఎల్ -1 వెళ్తూ వెళ్తూ సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి ఫొటోలు ఉండేటట్లు సెల్ఫీ తీసుకుని వాటిని ఇస్రోకు చేరవేసింది. ఈ ఫొటోలను ఎక్స్ లో ఇస్రో పోస్ట్ చేసింది. సెప్టెంబరు 2 నాడు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్ 1 ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్నది. దీని కక్ష్యను ఇప్పటికే రెండు సార్లు పెంచగా.. ఈ నెల 10న మూడోసారి పెంచనున్నారు. ఈ నెల 4న అది తీసుకున్న సెల్ఫీని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) అధికారికంగా సోషల్ మీడియా ‘X’లో పోస్ట్ చేసింది.
125 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఆదిత్య-ఎల్ 1.. సూర్యుడి చెంతన గల L1 పాయింట్ కు చేరుకుని పరిశోధనలు చేస్తుంది. రెండు పేలోడ్స్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్(VELC), స్పెక్ట్రోస్కోపి స్టడీస్ అండ్ సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) ఆధారంగా ఇమేజెస్ ను క్యాప్చర్ చేసింది.