
తుపాకీతో కాల్చుకుని సీనియర్ IPS ప్రాణాలు తీసుకున్నారు. రాష్ట్రంలోనే ఉన్నతమైన అడిషనల్ డైరెక్టర్ జనరల్(ADG) పోస్టులో కొనసాగుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. హరియాణా కేడర్ అధికారి పూరన్ కుమార్.. చంఢీగఢ్(Chandigarh)లోని నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎందుకలా చేశారన్నదానిపై సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం శోధన ప్రారంభించింది. 2001 బ్యాచ్ IPS పూరన్ కుమార్.. సునారియాలోని పోలీస్ ట్రెయినింగ్ సెంటర్ లో పనిచేస్తున్నారు. ఆయన సతీమణి అమన్ పి.కుమార్ IAS కాగా.. ఆమె జపాన్ టూర్ లో ఉన్నారు.
