ఏడు రాష్ట్రాల్లోని శాసనసభలకు జరిగిన ఉప ఎన్నికల్లో(By-Elections) NDA కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని చెప్పి 300 కూడా దాటని BJP అలయెన్స్… ఏడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లోనూ చతికిలపడింది. పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి.
13లో 10…
మొత్తం 13 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే అందులో పదింటిని ఇండియా కూటమి దక్కించుకుంది. రెండు స్థానాల్లో NDA కూటమి గెలిస్తే.. బిహార్లో ఇండిపెండెంట్ విజయం సాధించారు. బెంగాల్లో నాలుగింటికి 4 TMC గెలుచుకుంటే ఉత్తరాఖండ్ లోని రెండింటిని కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది.
హిమాచల్ ప్రదేశ్ CM సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమ్లేశ్ ఠాకూర్ డెహ్రా నుంచి.. పంజాబ్ లోని జలంధర్ వెస్ట్ లో ఆప్ సభ్యుడు మోహందర్ భగత్.. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లో కాంగ్రెస్ అభ్యర్థి 5 వేల ఓట్లతో విజయం సాధించారు.