2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొలి ఆరు నెలల్లో(Six Months)నే దేశంలో 26,770 మంది మృతిచెందారు. ఈ విషయాల్ని కేంద్ర రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ.. రాజ్యసభకు తెలిపారు. 2024లో 52,609 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ-మేరఠ్, ట్రాన్స్-హర్యానా, తూర్పు ప్రాంత ఎక్స్ ప్రెస్ వేల్లో భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల సంస్థ(NHAI) తీసుకొచ్చిన అడ్వాన్సుడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్(ATM) సిస్టం ద్వారా లెక్కలు తెలుస్తున్నాయన్నారు. ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాల్ని హైవేలపై ఉంచడంతో పూర్తిస్థాయి వివరాలు బయటపడుతున్నాయి. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com