మరోసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్ మఢ్(Abujmarh)లోని దట్టమైన అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి.AK-47, SLR రైఫిల్స్, పేలుడు వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే అత్యంత డేంజర్ జోన్ గా భావించే అబూజ్ మఢ్ అడవుల్లో జరిగిన ఘటనలో కీలక నేతలు మరణించినట్లు భావిస్తున్నారు.