కశ్మీర్లో మరో ప్రమాదం జరిగి నలుగురు జవాన్లు(Soldiers) దుర్మరణం పాలవగా, మరొకరు గాయపడ్డారు. బందిపొర జిల్లాలోని ఎస్.కె.పాయెన్ ప్రాంతంలో వులార్ వ్యూ పాయింట్ వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. పొగమంచులో దారి కనపడక(Poor Visibility) ప్రమాదం జరిగినట్లు సైనికాధికారులు అంటున్నారు. తొలుత ఘటనాస్థలిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, తర్వాత మరో సైనికుడు మృతి చెందారని తెలిపారు. గత నెలలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగి 5 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. పూంఛ్ ఏరియాలో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు 300 అడుగుల లోయలో పడిపోయింది.