కాంగ్రెస్ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు(Ex President) సోనియాగాంధీ వచ్చే ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు(File) చేశారు. రాహుల్, ప్రియాంక వెంటరాగా రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ సమర్పించారు. రెండున్నర దశాబ్దాల(25 Years) రాజకీయ చరిత్రలో లోక్ సభ ఎలక్షన్లకు ఆమె దూరంగా ఉండటం ఇదే తొలిసారి. రాజస్థాన్ నుంచి సోనియా, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, బిహార్ నుంచి అఖిలేశ్ ప్రదేశ్ సింగ్, చంద్రకాంత్ హందోర్ మహారాష్ట్ర నుంచి ఎగువసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని AICC ప్రకటించింది.
రెండు రాష్ట్రాల గురించి…
రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ల్లో ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లాలని కాంగ్రెస్ అధినేత్రి భావించారు. కానీ త్వరలోనే లోక్ సభ ఎన్నికలు(Loksabha) ఉన్నందున పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఎగువ సభకు వెళ్లడం ద్వారా రాజకీయం(Political)గా గట్టి మెసేజ్ ఇవ్వొచ్చనేది పార్టీ భావన. గాంధీల కుటుంబం నుంచి పెద్దల సభకి రావడంలో సోనియానే మొదటి వ్యక్తి కాదు. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకు ఇందిర ఎగువసభ మెంబర్ గా పనిచేశారు.
రాయ్ బరేలి విడిచి…
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గంతో గాంధీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కణ్నుంచి ఆమె 1999 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు(Five Times) లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019లో ఉత్తరప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఏకైన కాంగ్రెస్ వ్యక్తి సోనియా. ఇవే తన చివరి ప్రత్యక్ష ఎన్నికలని 2019లో ఆమె ప్రకటించగా.. అనారోగ్య కారణాలతో ఎన్నికల వ్యవస్థకు దూరంగా ఉంటున్నారు. త్వరలో జరిగే ఎలక్షన్లలో రాయ్ బరేలి నుంచి ప్రియాంక పోటీకి దిగే ఛాన్సెస్ ఉన్నాయన్న మాటలు వినపడుతున్నాయి. రాహుల్ వదిలిపెట్టిన అమేథీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనా ప్రియాంకలో ఉంది. అయితే రాయ్ బరేలీ, అమేథీ సెగ్మెంట్లలో ప్రియాంక ఎక్కణ్నుంచి పోటీ చేయాలన్నది హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.