
ఓటరు జాబితా సవరణ(SIR) నేటి నుంచి డిసెంబరు 4 వరకు జరగనుంది. 9 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, UP, రాజస్థాన్, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఛత్తీస్ గఢ్ తోపాటు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు(Union Terrotories) గోవా, లక్ష్యద్వీప్, అండమాన్-నికోబార్ లో ఓటరు జాబితా సవరణ మొదలవుతుంది. ఇప్పటికే ఇది బిహార్ లో పూర్తి కాగా.. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని EC నిర్ణయించింది. డిసెంబరు 9న ముసాయిదా జాబితాల్ని ప్రకటిస్తుంది. 51 కోట్ల మంది ఓటర్ల పరిశీలన పూర్తి చేసి 2026 ఫిబ్రవరిలో ఫైనల్ లిస్టును ఎన్నికల సంఘం ప్రకటించనుంది.