ముంబయిలో ఘోర పడవల ప్రమాదం జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోగా, 101 మంది ప్రయాణికుల్ని రక్షించారు. సముద్రంలో విహరిస్తున్న పర్యాటక(Tourism) బోటును నావికాదళానికి చెందిన బోటు బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో టూరిజం బోటులో 114 మంది ఉన్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా బుచర్ ఐలాండ్ వద్ద బోటు ఢీకొట్టి ఫెర్రీ మునిగిపోయింది. అందులో చాలా మంది నీటిలో గల్లంతు కాగా, పలువురిని రక్షించారు. జాకెట్లు ధరించిన ఉండటంతో బాధితుల్ని కాపాడటం సులువైంది. 11 నేవీ కోస్ట్ గార్డు బోట్లు, 3 మెరైన్ బోట్లతో గాలింపు చేపట్టారు.