జీవిత భాగస్వామి(Life Partner)ని అనుమానించే కేసులో సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. రహస్యంగా రికార్డ్ చేసిన టెలిఫోన్ సంభాషణ ఆమోదయోగ్యమైన సాక్ష్యమని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ స్పష్టం చేసింది. ఇది గోప్యతను ఉల్లంఘించడమేనని, సాక్ష్యంగా చూడలేమన్న పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఇలా చేయడం వల్ల గృహ సామరస్యం, వైవాహిక బంధాలు దెబ్బతింటాయన్న వాదనల్ని జస్టిస్ బి.వి.నాగరత్న పరిశీలించారు. నిఘాను ప్రోత్సహించడమే అవుతుంది కానీ.. ఆ స్థాయికి చేరుకుంటే సదరు బంధం విఛ్చిన్నమైనదేనని జస్టిస్ నాగరత్న గుర్తు చేశారు. https://justpostnews.com
భార్య క్రూరంగా ప్రవర్తించిందంటూ భటిండాకు చెందిన వ్యక్తి విడాకులు కోరాడు. ఫోన్ సంభాషణల CDని రుజువుగా కుటుంబ కోర్టు అనుమతించింది. దీన్ని ఆమె హైకోర్టులో సవాల్ చేయగా.. కింది కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. బాధితుడు సుప్రీంను ఆశ్రయించగా.. కుటుంబ కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఆదేశాల్ని పక్కనబెట్టింది.