మహాకుంభ్ స్పెషల్ తోపాటు మరో రెండు రైళ్లు(Trains) ఆలస్యంగా రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇద్దరు సభ్యుల ఉన్నతస్థాయి(High Level) కమిటీ ఏర్పాటైంది. 3 రైళ్లు ఆలస్యం కావడం, అప్పటికే 1,500 జనరల్ టికెట్లు అమ్మడంతో ప్లాట్ ఫాంలపైకి భారీగా జనాలు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని, భువనేశ్వర్ రాజధాని రైళ్ల కోసం 13, 14 నంబర్లు గల ప్లాట్ ఫాంలు రద్దీగా మారాయి. మహాకుంభ్ ట్రెయిన్ కూడా ప్లాట్ ఫాం 14 నుంచి రాత్రి 10:10 గంటలకు బయల్దేరాల్సి ఉంది.
ప్రయాగరాజ్ రైలు సమయం దగ్గరపడుతుండగా 1,500 జనరల్ టికెట్లు సేల్ చేశారు. అదే టైంలో ఈ రైలు 14కు కాకుండా వేరే ప్లాట్ ఫాంకు వస్తుందంటూ పుకార్లు వ్యాపించాయి. దీంతో ఒకర్నొకరు తోసుకుంటూ అటువైపు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. పుకార్ల విషయం తెలిసిన రైల్వే అధికారులు.. స్పెషల్ ట్రైన్ వేరే ప్లాట్ ఫాంపైకి వెళ్లడం లేదని చెప్పినా ఎవరూ వినలేదని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.