పంతాల నడుమ ప్రతిష్ఠాత్మకం(Prestigious)గా మారిన లోక్ సభ స్పీకర్ ఎన్నిక.. ఇరువర్గాలకు కీలకం కానుంది. మెజారిటీ సభ్యులు ఉంటేనే తమ అభ్యర్థిని గెలిపించుకునే వీలుంటుంది. 18వ లోక్ సభలో BJP కూటమి NDAకు సంపూర్ణమైన బలం ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ తమకు కేటాయించలేదన్న కారణంతో స్పీకర్ ఏకగ్రీవానికి ఇండియా కూటమి పక్షాలు దూరంగా ఉన్నాయి.
బలాబలాలు చూస్తే…
స్పీకర్ పదవికి ఈరోజు ఎన్నిక జరుగుతుండగా ఇప్పటికే ఆ ప్రతిపాదనను ప్రధాని మోదీ సభ ముందుంచారు. NDA నుంచి తాజా మాజీ స్పీకర్ ఓం బిర్లా, ఇండియా కూటమి(Alliance) నుంచి కె.సురేశ్ పోటీలో ఉన్నారు. YSRCP మద్దతుతో కమలం పార్టీ కూటమికి 297 మంది సభ్యుల మద్దతు ఉంది.
ఇక విపక్ష(Opposition) కూటమికి 233 మంది సభ్యులున్నా కేరళలోని వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా చేశారు. ఖలిస్థానీ లీడర్ అమృత్ పాల్ సింగ్, అతివాద కార్యకలాపాలకు పాల్పడే రషీద్ ప్రమాణస్వీకారం చేయలేదు. మెజారిటీ మార్క్ అయిన 271 మంది సభ్యుల బలం అధికార పక్షానికి ఉంది.