
నుదుటిపై తిలకం పెట్టుకున్నాడంటూ ఓ స్టూడెంట్ ను స్కూల్ నుంచి బయటకు వెళ్లగొట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనంగా మారింది. మరోసారి ఇలాగే వస్తే TC ఇస్తామని హెచ్చరించి మరీ ఇంటికి పంపించింది ఆ ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు స్కూల్ కు వెళ్లి మేనేజ్ మెంట్ ను నిలదీశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ను హెచ్చరించింది. విద్యాలయాల్లో అన్ని మతాలను ఈక్వల్ గా చూడాలని, మత సామరస్యం కొనసాగేలా బోధన సాగాలని సూచించింది.