కోల్ కతా డాక్టర్ అత్యాచారం(Rape), హత్య కేసును తీవ్రంగా భావించి సుమోటో(Suo Moto)గా స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టడం లేదు. సాక్ష్యాలు తారుమారు చేసేలా ప్రయత్నించారంటూ ఇప్పటికే బెంగాల్ సర్కారుతోపాటు కాలేజీ పెద్దల్ని ఎండగట్టిన న్యాయస్థానం.. అనుమానాస్పదం(Suspected)గా తయారైన మాజీ ప్రిన్సిపల్ పైనా దృష్టిపెట్టింది.
మొన్నటిదాకా ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్ తోపాటు మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు CBIకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. నిజాలు రాబట్టేందుకు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. బీపీ, హార్ట్ బీట్, బ్రీతింగ్ వంటి సెన్సార్లతో కూడిన పరికరాల్ని నిందితుల శరీర ప్రాంతాల్లో అమర్చి ప్రశ్నిస్తారు.
తొలుత సాధారణ ప్రశ్నలతో స్టార్ట్ చేసి తర్వాత అసలైన అంశాలపై ఫోకస్ చేస్తారు. ప్రశ్నిస్తున్న టైంలో హార్ట్ బీట్ రేట్ పెరగడం, అరికాళ్లు, అరచేతుల్లో చెమటలు పట్టడం, కంగారు, ముఖ కవళికల్లో తేడాల వంటి శారీరక మార్పుల్ని రికార్డ్ చేస్తారు. అనంతరం వాటిని పూర్తిస్థాయిలో విశ్లేషించి నిందితుడు చెప్పేవి నిజాలా, అబద్ధాలా అన్న నిర్ణయానికి వస్తారు.